సెలూన్ లో బంగారం రేజర్తో షేవింగ్ – దేశంలో రికార్డ్ – షేవింగ్ రేటు ఎంతో తెలుసా

0
ఈ కరోనాతో అన్నీ వ్యాపారాలు డల్ అయ్యాయి.. చాలా మందికి ఆర్ధికంగా నష్టాలు వచ్చాయి.. ఇక ఉద్యోగులకి కొన్ని కంపెనీలు జీతాలు ఇవ్వలేదు.. పరిశ్రమలు ఓపెన్ కాలేదు, దాదాపు 9 నెలలు చిన్న చిన్న పనులు వ్యాపారాలు చేసుకునేవారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు వ్యాపారులు, అయితే పుణెకు చెందిన ఓ సెలూన్ షాప్లో ఏకంగా బంగారం రేజర్తో షేవింగ్ చేస్తున్నారు. బాగా ధనవంతులు ఇంట్లో వాడుకుంటారు కాని సెలూన్ లో ఇలా చేయడం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు.. కాని ఇది నిజం.. బంగారంతో చేసిన రేజర్ తో షేవింగ్ చేస్తున్నాడు ఈ వ్యక్తి.
అవినాష్ బొరుండియా అనే బార్బర్కు పుణె ఓ సెలూన్ షాప్ ఉంది. లాక్ డౌన్ లో అతను చాలా ఇబ్బంది పడ్డాడు, ఆర్దికంగా చాలా అప్పులపాలయ్యాడు…  ఇక ఇప్పుడు షాపు తీశాడు.. కస్టమర్లను ఆకర్షించాలి అని ఇలా కొత్త ఐడియా ఫాలో అవుతున్నాడు.
బంగారం రేజర్ను తయారు చేయించాడు. 80 గ్రాముతో తయారుచేసిన ఆ రేజర్కు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టాడు. మంచి పబ్లిసీటీ ఇచ్చాడు బోర్డులు పెట్టాడు, ఎమ్మెల్యే చేత షాపు ఓపెన్ చేయించాడు, సరదాగా చేయించుకుందాం అని చాలా మంది వస్తున్నారు…గోల్డెన్ రేజర్తో షేవింగ్కు అతడు రూ.100 వసూలు చేస్తున్నాడు. చాలా అందుబాటు ధర అని అందరూ వస్తున్నారు. వారి ముందు కొత్త బ్లేడ్ పెట్టి చేస్తున్నాడు, రోజు 5 వేల పైనే వస్తోందట ఇప్పుడు గిరాకీ పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here