తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయి అదుపు తప్పి బోత్తాపడింది… ఈ ప్రామాదంలో ఇద్దరు మృతి చెందారు… ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని హుటా హుటీన ఆసుపత్రికి తరలించారు…
ఈప్రమాదం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు గ్రామ సమీపంలో జరిగింది… పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వస్తుండగా కాన్వాయిలో ఆయన వెనకే వస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది…
ఈ ఘటనలో డ్రైవర్ పార్థసారధి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్నేందర్ మృతి చెందారు… వాహనంలో ప్రయాణిస్తున్న మరికొందరు తీవ్ర గాయాలు అయ్యాయి… గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు… మంత్రి దయాకర్ రావు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు