Nara Lokesh | విద్యాశాఖపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్

-

రాష్ట్ర విద్యాశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. ఈరోజు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై పాఠశాలవిద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, జిఓ 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈనెల 3వతేదీన శాసనసభ్యులతో వర్క్ షాపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం.

- Advertisement -

ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చెయ్యాలని ఆదేశించాను. పిజి ఫీజు రీఎంబర్స్ మెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కోరాను. అమరావతిలో ఏఐ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ పనులను వేగవంతం చెయ్యాలని చెప్పాను. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’’ అని Nara Lokesh తెలిపారు.

Read Also: అనుచరుడి పాడె మోసిన మంత్రి తుమ్మల

Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే...

Srinivas Goud | SLBC ప్రాజెక్ట్ పై సరైన అవగాహన లేకే ఈ ప్రమాదం – శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో...