ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు నారాలోకేశ్ తర్వాత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న యాక్టివ్ గా కనిపిస్తున్నారు… రాష్ట్రంలో జరుతున్న కరెంట్ ఇష్యూస్ పై స్పందిస్తూ తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు… ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిలను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్లు పెడుతుంటారు… అయితే ఇదే క్రమంలో మరో సంచలన ట్వీట్ చేశారు…
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతంలో దోమలు అరికట్టడానికి నానా తంటాలు పడుతున్నారట. రాష్ట్రంలో అత్యధిక డెంగ్యూ, మలేరియా జ్వరాలు తాడేపల్లిలోనే నమోదు అయ్యాయి. అందుకే గతంలో దోమల పై దండ యాత్ర కార్యక్రమాన్ని ఎద్దేవా చేసిన విజయసాయి రెడ్డికి మస్కిటో ఛాలెంజ్ విసురుతున్నానని అన్నారు బుద్దా వెంకన్న
తక్కువ ఖర్చుతో అయ్యే దోమల బ్యాట్ తో నివారించినా ఛాలెంజ్ లో గెలిచినట్టే అని తెలిపారు. విజయసాయి రెడ్డి గెలిచాకా ఆర్థిక నిపుణులు, దోమల ఎక్స్ పర్ట్ బుగ్గనకి మస్కిటో ఛాలెంజ్ విసరాలని కోరుకుంటున్నానని తెలిపారు అలా రాష్ట్రమంతా వైసీపీ నాయకులు పోటీ పడి ప్రజల్ని జ్వరాల నుండి బయటపడేయండని అన్నారు