చెర్రీ కోసం 10 కోట్లు ఖర్చుచేసిన రాజమౌళి

చెర్రీ కోసం 10 కోట్లు ఖర్చుచేసిన రాజమౌళి

0
136

తారక్, చెర్రీ, రాజమౌళి, ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆశలు బాగా పెట్టుకున్నారు అభిమానులు.. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ని కొమరమ్‌ భీమ్‌గా, రామ్‌చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లోకి మార్చేశారు దర్శకుడు రాజమౌళి. వీరి గురించి అనేక స్టిల్స్ బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఓ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది జక్కన్న ఓ చోట ఆయన సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ మరోచోట చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారట.. అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయాలి అని చూస్తున్నారు. అందుకే చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

ఎన్టీఆర్‌ సరసన ఓలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఆలియా భట్‌లపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నారట. దీనికోసం ఓ భారీ సెట్‌ని కూడా వేశారని తెలిసింది. అయితే సుమారు 10 కోట్ల రూపాయలు ఈ సెట్ కోసం ఖర్చు చేశారట, మొత్తానికి ఆలియాభల్ చెర్రీ మధ్య ఈ సాంగ్ సూపర్ వచ్చింది అంటున్నారు చిత్ర యూనిట్