ఓ ప్రముఖ ఛానల్ లో జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది… ఈ షో ప్రేక్షకులను చాలా ఏళ్లుగా అలరిస్తూ నవ్విస్తూ వస్తోంది… అయితే తాజాగా ఈ షోకు నటుడు నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తూ వచ్చారు… ప్రస్తుతం ఈషోకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు…
ఇటు టెలివిజన్ లో అటు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది జబర్దస్త్… అలాంటి షోనుంచి తాజాగా నాగబాబు బయటకు వచ్చారు దీంతో ఈ షో కాస్త సంక్షోభంలో పడినట్లు కనిపించినా రోజా కంటిన్యూ చేస్తూ వస్తోంది…
ఈ షోను రోజాతోనే కంటిన్యూ చేయలిని ముందుగా భావించినప్పటికీ ఇప్పుడు నాగబాబు స్థానంలో హీరో సాయికుమార్ ను ఫిక్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే ఎగస్ట్రా జబర్దస్త్ కు అలీని ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది…