డీలిమిటేషన్ బిల్లు: స్టాలిన్‌ను ఒప్పించడానికి రంగంలోకి రాహుల్

-

Alltimereport : కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌(Delimitation)పైనే ప్రస్తుతం దేశమంతా ఫోకస్ పెట్టింది. ప్రతి రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు దీని గురించే చర్చిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇండి కూటమి (INDIA Bloc) కూడా ప్రస్తుతం ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ బిల్‌ను వ్యతిరేకించాలని ఇండి కూటమి భావిస్తోంది. అందులో ఇప్పటికే కొన్ని పార్టీలు ఇండి కూటమిని కాదని డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని చూస్తున్నాయి. వాటిలో తమిళనాడులోని డీఎంకే (DMK) కూడా ఒకటి. ఈ విషయాన్ని ఎంకే స్టాలిన్ వెల్లడించారు. కాగా ఆయన మనసు మార్చడం కోసం ఇప్పుడు ఇండి కూటమి తరుపున రాహుల్ గాంధీ (Rahul Gandhi) రంగంలోకి దిగాడు. అందులో భాగంగానే ఆదివారం ఆయన చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిసి ఈ బిల్లును అడ్డుకోవాలని ఆయన కోరనున్నారు.

- Advertisement -

శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సవరించిన డీలిమిటేషన్(Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్‌సభ సీట్లు 543 నుండి గరిష్టంగా 850కి పెరుగుతాయి. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగడంతో పాటు, 2051 వరకు 1971 జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్రాల వాటా కొనసాగుతుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దీనివల్ల 2029 ఎన్నికల నాటికి 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం అవుతుంది. గత ఏప్రిల్‌లో పాత బిల్లు వీగిపోయినప్పుడు స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, తాజా ముసాయిదాలో తమిళనాడుకున్న 7.18 శాతం సీట్ల వాటాకు రక్షణ కల్పిస్తూ, 1971 జనాభా నిష్పత్తిని కొనసాగిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో శనివారం స్టాలిన్ దీనిని స్వాగతించారు. తమిళనాడు వాటా 7.21 శాతానికి పెరుగుతుందని డీఎంకే నేత ఎ. రాజా తెలిపారు.

ఆదివారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, రాహుల్ బృందం స్టాలిన్‌ను కలవకపోవడమే మంచిదని సూచించినా కాంగ్రెస్ నేతలు చెన్నై పర్యటనకు సిద్ధమయ్యారు. 850 సీట్ల పెంపు ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుందని, బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లకు ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చుకునే అవకాశం ఇస్తుందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ బిల్లును కలిసి ఓడించాలని ఆయన కోరారు.

దీనికి స్టాలిన్ (MK Stalin) స్పందిస్తూ, రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపినా, తమిళ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని, తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత కాంగ్రెస్-డీఎంకే పొత్తు విచ్ఛిన్నమైన విషయాన్ని గుర్తు చేస్తూ డీఎంకే ఐటీ విభాగం రాహుల్‌పై విమర్శలు చేసింది. సోమవారం నుండి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి 241 మందితో కలిపి ఎన్డీయేకు సుమారు 320 మంది ఎంపీల బలం ఉంది. ఈ బిల్లుకు డీఎంకే (22 మంది), శరద్ పవార్ పార్టీ (8 మంది) మద్దతు ప్రకటించడంతో, అనుకూల ఓట్ల సంఖ్య 350కి చేరే అవకాశం ఉంది.

Also Read : విరాట్ కోసం ప్రాణాలైనా పెట్టేవాళ్లం: కుల్దీప్

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మొహమ్మద్’ పేరు నచ్చక.. గొంతు నులిమి చంపేశాడు!

Alltimereport : 'మొహమ్మద్' అనే పేరు నచ్చకపోవడంతో ఉబెర్ డ్రైవర్‌(Uber Driver)పై...

హిస్టరీలో ఫస్ట్ టైమ్.. రష్యా భారీ డిఫెన్స్ బడ్జెట్ ఆమోదం

Alltimereport : ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...