డీలిమిటేషన్ కు బీఆర్ఎస్ సపోర్ట్.. ప్రకటించిన కేటీఆర్

-

Alltimereport : పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill) విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ లో లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పించే ప్రతిపాదన దక్షిణాది ప్రయోజనాలను కాపాడుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ ప్రతిపాదన అమలుతో తెలంగాణాలో లోక్ సభ స్థానాలు ప్రస్తుతం 17 ఉండగా.. 26 కి పెరుగుతాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే బీఆర్ఎస్ (BRS) కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తోందని, వాటి అమలుకు కూడా కట్టుబడి ఉందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IAS అధికారి.. జాబ్స్ పోగొట్టుకున్న ఐదుగురు చిరుద్యోగులు

Alltimereport : అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి ఆగ్రహానికి బలయ్యేది చివరకు...

డీలిమిటేషన్‌కు మద్దతు.. సుప్రియకు కేంద్రమంత్రి పదవి!

Alltimereport : డీలిమిటేషన్ బిల్లుకు (Delimitation Bill) మద్దతుకోసం కేంద్ర ప్రభుత్వంలని...