గోదావరిఖనిలో ఘోరం.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య

-

Alltimereport : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని(Godavarikhani)లో ఘోరం చోటు చేసుకుంది. సింగరేణి ఉద్యోగి రాజశేఖర్(30)ను నమ్మబలికి తీసుకెళ్లి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో కొందరు యువకులు రాజశేఖర్‌కు ఫోన్ చేశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగానే.. మాయ మాటలు చెప్పి ఇంటి బయటకు రప్పించారు. రాజశేఖర్ ఇంటి బయటకు రాగానే దుండగులు కత్తులతో దాడి చేశారు. రాజశేఖర్ మరణించినట్లు నిర్ధారించుకున్న వెంటనే దుండగులు పరారయినట్లు సమాచారం.

- Advertisement -

ఈ ఘటనపై గోదావరిఖని (Godavarikhani) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో నలుగురు యువకులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా హంతకులు ఎక్కడికి పారిపోయారు? అసలు రాజశేఖర్‌ను ఎందుకు హత్య చేశారు? దీనికి కారణం ఏంటి? వాళ్లే చేశారా లేదంటే ఎవరైనా చేయించారా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read : అర్ధనారీశ్వరుడి శిల్పంతో రాహుల్‌ కొత్త అస్త్రం

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ట్రంప్‌కు కిమ్ నో రెస్పాన్స్.. ఫోన్ చేసినా..

Alltimereport : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌(Kim Jong...

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి.. మంత్రులు, నాయకులకు చంద్రబాబు ఆదేశాలు

Alltimereport : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం రెండున్నరేళ్ల పాలనకు...