Alltimereport : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియను అడ్డుకునే వాళ్లంతా దేశద్రోహులే అంటూ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండిసంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పన్నాగాలు పన్నుతున్నాయనీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగానే నవంబర్ 23న కరీంనగర్లో నిర్వహించే మహా పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు. కరీంనగర్‌లోని గురుద్వారా వద్ద ఆదివారం సోలార్ ప్యానెల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డికి భాజపా అంటే భయమని, తమ పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సర్’పై ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేందుకే నవంబర్ 23న మహా పాదయాత్ర (Maha Padayatra) చేపడుతున్నట్లు బండి సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మ, తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు పాల్గొంటారని తెలిపారు.
Also Read : భారత్ ఎదుగుదలకు చైనా అడ్డంకులు.. అమెరికా హెచ్చరిక!
Follow Us On: Whatsapp


