Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నవంబర్ 25న జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నారు. లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్(Lulu Mall)లో 100 ఉద్యోగాల భర్తీకి ఈ మేళా చేపడుతున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం అందించనున్నారు. ఈ జాబ్ మేళాలో డేటా ఎంట్రీ ఆపరేటర్, సేల్స్ అసోసియేట్, క్యాషియర్, కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు హాజరుకావచ్చు.
నవంబర్ 25న ఉదయం 11 గంటల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరోలో జాబ్ మేళా (OU Job Mela) జరగనుంది. ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో వద్ద అభ్యర్థులు నేరుగా హాజరుకావాలి. అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరుకావాలి. అర్హత ఉన్నవారు నేరుగా వచ్చి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. మరిన్ని వివరాల కోసం హెచ్‌ఆర్ మేనేజర్ శ్రీనివాస్‌ను 8712699096, 8712699097, 7306336001 నంబర్లలో సంప్రదించవచ్చు.
Also Read : తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?
Follow Us On: Whatsapp


