Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా విడుదలైన నాలుగు తెలుగు సినిమాలు ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లలోనే సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి వాటిని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా పైరసీకి గురైందని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు (Tollywood Piracy Case) నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘రణబాలి’, ‘కల్ట్‘, ‘ఆదర్శ కుటుంబం’, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలు కూడా పైరసీ అయినట్లు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ లో ఉన్న థియేటర్లో మూడు సినిమాలను కొందరు వ్యక్తులు రహస్యంగా రికార్డ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లో సినిమాలను రికార్డు చేసిన వారి నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వారి వరకు ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పైరసీ నెట్వర్క్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడంతోపాటు సినిమాలు లీక్ కావడానికి ఉపయోగించిన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ పైనా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : భారత్‌ను చూసి నేర్చుకోండి.. సెంట్రల్ బ్యాంక్‌కు ట్రంప్ క్లాస్
Follow Us On: Whatsapp


