‘ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండాల్సిందే’

-

Alltimereport : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దేశవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారు. ముస్లింల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో హిందువులకు రక్షణ ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా ‘హమ్ దో హమారే దో’ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం తీసుకురాని పక్షంలో ప్రతి హిందూ కుటుంబం ఆత్మ రక్షణ కోసం లైసెన్స్‌డ్ గన్ కలిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

- Advertisement -

రాబోయే 20 ఏళ్లలో ముస్లింల జనాభా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందంటూ ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించిన రాజాసింగ్.. జనాభా సమతుల్యత దెబ్బతింటే హిందువుల భవిష్యత్తు, భద్రత ప్రశ్నార్ధకంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల ఆస్తులు, మహిళల భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ లో హిందువులు ఎదుర్కొంటున్న దాడులు, బలవంతపు మతమార్పిడుల పరిస్థితులు భారత్ లోనూ తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. యూపీ తరహాలో దేశవ్యాప్తంగా హిందువులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ (Raja Singh) చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.

Also Read : భారత్‌ను చూసి నేర్చుకోండి.. సెంట్రల్ బ్యాంక్‌కు ట్రంప్ క్లాస్

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం

Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా...

భారత్‌ను చూసి నేర్చుకోండి.. సెంట్రల్ బ్యాంక్‌కు ట్రంప్ క్లాస్

Alltimereport : అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్...