రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

-

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ ర్యాలీలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు ర్యాలీ కొనసాగనుంది. నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. సైబర్ టవర్స్, హైటెక్స్ మెటల్ చార్మినార్, హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసరాల్లో ట్రాఫిక్ ప్రభావం ఉండనుంది. కొండాపూర్, కొత్తగూడ వైపు వెళ్లేవారు యశోద-వసంత సిటీ రోడ్డును ఉపయోగించాలి. బొటానికల్ గార్డెన్ వెళ్లేవారికి ఐకియా రోటరీ, మీనాక్షి, రోలింగ్ హిల్స్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గం కల్పించారు.

- Advertisement -

కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే వాహనాలు రాడిసన్, ఏఐజీ, ఐకియా రోటరీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. టెక్ మహీంద్రా నుంచి మెటల్ చార్మినార్ వైపు వచ్చే వాహనాలను సీఐఐ జంక్షన్ వద్దే ఇతర మార్గాల్లోకి మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ర్యాలీ (Gig Workers Rally) జరిగే మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Also Read : ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...

తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

Telangana IPS Transfers | తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు...