తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

-

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడవచ్చని అధికారుల అంచనా. అది క్రమంలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో పడొచ్చని, తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

వాయుగుండం బలపోతమైన తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు సూచిస్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దిశను మార్చుకుని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల తీరాల వైపు తుఫాను ప్రయాణించొచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావం రాబోయే మూడు, నాలుగు రోజులు ఉండొచ్చని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

Telangana IPS Transfers | తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు...

భారత ఫుట్‌బాల్‌కు జర్మనీ ఫార్ములా!

భారత ఫుట్‌బాల్ (Indian Football) భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని...