Alltimereport : న్యూజిలాండ్ గడ్డపై భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన 720 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. తొలి ఏడు వికెట్లకు యాభైకి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్(Ind vs NZ)లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తొలి వికెట్‌కు 130 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. రెండో రోజు చివర్లో జైస్వాల్ 85 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఆ తర్వాత రాహుల్(KL Rahul), దేవదత్ పడిక్కల్ కలిసి రెండో వికెట్‌కు 165 పరుగులు జోడించారు. పడిక్కల్ 80 పరుగులు చేశాడు. అనంతరం కెప్టెన్ గిల్‌తో కలిసి రాహుల్ మూడో వికెట్‌కు 91 పరుగులు జతచేశాడు. 136 పరుగులు చేసిన రాహుల్ ఔటైన తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. గిల్, పంత్ నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో రోజు చివర్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో రోజు తొలి గంటలోనే పంత్, నైట్ వాచ్‌మన్ అన్షుల్ కంబోజ్ వేగంగా 75 పరుగులు జోడించారు. లంచ్ సమయానికి ముందు పంత్ (Rishabh Pant) 128 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే అంతకుముందే ధ్రువ్ జురెల్‌తో కలిసి 54 పరుగులు జోడించాడు. ఆ తర్వాత జురెల్, వాషింగ్టన్ సుందర్ మరో 54 పరుగులు జతచేయడంతో భారత్ 700 పరుగుల మార్కు దాటింది.
చివరకు 9 వికెట్లకు 720 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, 352 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో భారత్ పలు రికార్డులను తిరగరాసింది. టెస్టుల్లో న్యూజిలాండ్‌పై ఇదే అత్యధిక స్కోరు. 1995లో ఇదే వేదికపై వెస్టిండీస్ చేసిన 660 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది. అలాగే న్యూజిలాండ్ గడ్డపై ఇదే అత్యధిక టీమ్ స్కోరు. 2019లో బంగ్లాదేశ్‌పై కివీస్ చేసిన 715 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు అంతకంటే ఎక్కువ 50 ప్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పడం భారత్‌కు ఇది రెండోసారి. గతంలో 2007లో ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌లో భారత్ ఎనిమిది అర్ధశతక భాగస్వామ్యాలు నమోదు చేసింది.
Also Read : కెనడాలో భారత జంట దారుణ హత్య..
Follow Us On: Whatsapp


