149 ఏళ్లలో తొలిసారి.. సఫారీల సరికొత్త చరిత్ర!

-

Alltimereport : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 149 ఏళ్ల తర్వాత మరో అరుదైన రికార్డ్ నమోదయింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ (Wiaan Mulder) ఈ చరిత్రను సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో అతడు ఈ ఘన సాధించాడు. ఈ మ్యాచ్‌లోనే బ్యాట్‌తో 100 పరుగులు చేసిన అతడు.. బౌలింగ్‌లో కేవలం 31 పరుగులకే 7 వికెట్లు తీశాడు. ఒకే టెస్టులో సెంచరీ చేసి, ఏడు వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా ముల్డర్ నిలిచాడు.ఈ ఘనతను ముల్డర్‌కు ముందు నలుగురు ఆటగాళ్లు సాధించారు.

- Advertisement -

ఆస్ట్రేలియాకు చెందిన జాక్ గ్రెగరీ 1920లో మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌పై ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ రెండుసార్లు ఈ ఫీట్ సాధించాడు. 1978లో పాకిస్థాన్‌పై లార్డ్స్‌లో, 1980లో భారత్‌పై ముంబై వాంఖడేలో ఈ ఘనత నమోదు చేశాడు. భారత్‌కు చెందిన రవిచంద్రన్ అశ్విన్ 2016లో వెస్టిండీస్‌తో నార్త్ సౌండ్‌లో జరిగిన టెస్టులో సెంచరీతో పాటు ఏడు వికెట్లు తీశాడు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు నసీర్ ఖాన్ మారూఫ్‌ఖిల్ 2026లో జింబాబ్వేపై షార్జాలో ఈ ఘనత సాధించాడు.

గతేడాది జులైలో జింబాబ్వేపై జరిగిన టెస్టులో ముల్డర్ (Wiaan Mulder) అజేయంగా 367 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 494/7 వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను ముల్డర్ దెబ్బతీశాడు. తంజీద్ హసన్, మొమినుల్ హక్‌లను ఔట్ చేసి ఆరంభంలోనే ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత జాకర్ అలీ, షరీఫుల్ ఇస్లాంను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపి తొలి ఐదు వికెట్ల ఘనత సాధించాడు.

కెప్టెన్ శాంటోతో పాటు టాస్కిన్ అహ్మద్‌ను కూడా ఔట్ చేసి ఏడు వికెట్లు పూర్తి చేశాడు. ముల్డర్ దెబ్బకు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

Also Read : కైరో రహదారిపై మృత్యుజ్వాలలు.. 31 మంది సజీవ దహనం

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అమెరికా 25శాతం టారిప్‌పై కేంద్రం రియాక్షన్ ఇదే!

Alltimereport : అమెరికా, భారత్ మధ్య మరోసారి టారిఫ్ చర్చలు మొదలయ్యాయి....

కైరో రహదారిపై మృత్యుజ్వాలలు.. 31 మంది సజీవ దహనం

Alltimereport : ఈజిప్ట్ (Egypt) రాజధాని కైరోలో ఘోర ప్రమాదం (Cairo...