Alltimereport : మహబూబాబాద్(Mahabubabad)లోని ఓ బాలికల గురుకుల కాలేజీ హాస్టల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ బాత్రూంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్దిసేపటికే శిశువు మరణించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఈ ఘటన జరిగింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉదయం ప్రేయర్‌కు రాలేదు. దీంతో తోటి విద్యార్థినులు ఆమె కోసం వెతికారు. హాస్టల్ గదుల్లో, కళాశాల ప్రాంగణంలో పరిశీలించినా కనిపించలేదు. దీంతో బాత్రూంలో చూడగా.. ప్రసవించిన అనంతరం స్పృహతప్పి పడిపోయిన స్థితిలో కనిపించింది.
వెంటనే కళాశాల సిబ్బంది మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. స్పృహతప్పిన విద్యార్థినిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, శిశువు పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బిందుమాధురి, వైద్యురాలు అరుణ తెలిపారు. విషయం తెలిసి విద్యార్థిని తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ (Mahabubabad) టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?
Follow Us On: Whatsapp


