నారాయణ విద్యాసంస్ధల అధినేత మాజీ మంత్రి నారాయణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు .. చంద్రబాబుకు ఆయన నమ్మినవ్యక్తి , అంతేకాదు ఐదు సంవత్సరాలు ఆయన టీడీపీలో కీ రోల్ పోషించారు.. సీఆర్డీయే వ్యవహారాలు చూశారు. అంతేకాదు మంత్రిగా బాబు సర్కారులో కేబినెట్లో ఉన్నారు. అయితే ఆయన ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత రాజకీయంగా ఆయన పెద్దగా కనిపించడం లేదు.
ఆయన తన కళాశాలలు స్కూల్స్, కార్పొరేట్ వ్యవహరాల్లో బిజీ అయిపోయారు.. అయితే ఆయన రాజకీయంగా మంచి చాణిక్యత కలిగిన నేత అని గుర్తించారు బీజేపీ నేతలు.. ఆయనని బీజేపీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారట.. అయితే వైసీపీ నారాయణకు చాలా దూరం. అందుకే ఆయనని పార్టీలోకి రావాలి అని పిలవడం లేదు. అలాగే పార్టీ నేతలతో ఆయన టచ్ లో లేరు, కాని నారాయణ లాంటి కమిట్మెంట్ ఉన్న నేత బీజేపీలోకి వెళ్లరు అని అంటున్నారు టీడీపీ నేతలు.. కాని ఆయన మాత్రం ప్రస్తుతం టీడీపీలో కూడా అంటి ముట్టనట్టు ఉంటున్నారు.. సో చూడాలి ఆయన పొలిటికల్ స్టెప్ ఎలా ఉంటుందో.