చిక్కుల్లో చంద్రబాబు తెరపైకి ఓటుకు నోట్ల కేసు

చిక్కుల్లో చంద్రబాబు తెరపైకి ఓటుకు నోట్ల కేసు

0
104

అప్పట్లో దేశ వ్యాప్తంగా ఓటుకు నోట్ల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే… 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఆ కేసులో రిమాండ్ ఎదుర్కోవడంతో పాటు కొన్నిరోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విధితమే….

అయితే తాజాగా ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది… సుప్రీంకోర్టు ఈ కేసుపై ఎర్లీ హియారింగ్ పిటీషన్ దాఖలైంది… మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ పిటీషన్ ను మరోసారి ధాఖలు చేశారు…

2017లో ఓటుకు నోటుకు కేసుపై పిటీషన్ దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టులో ఆ పిటీషన్ లిస్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీంకోర్టు ఆశ్రయించారు…