సైకిల్ మాజీ ఎమ్మెల్యేకి కన్నా బంపర్ ఆఫర్

సైకిల్ మాజీ ఎమ్మెల్యేకి కన్నా బంపర్ ఆఫర్

0
81

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బెడిసి కొడుతున్నాయి.. ముఖ్యంగా సీనియర్లని పార్టీ వదిలి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు చంద్రబాబు. కాని తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యేకి మంచి బీసీ ఫాలోయింగ్ ఉంది. ఆయనని పార్టీలో చేర్చుకోవాలి అని బీజేపీ చూస్తోందట.

అయితే ఆయన కూడా ఇటీవల పార్టీలో చేరాలి అని చూశారట.. అయితే మళ్లీ టీడీపీలో కొనసాగాలి అని ఆగారు, కాని వైసీపీపై టీడీపీ పోరాటం చేసేలా కనిపించడం లేదని, టీడీపీలో ఇప్పుడు లోకేష్ చంద్రబాబుకి వ్యతిరేకత పెరిగింది అని అందుకే ఆయన కూడా పార్టీ మారాలి అని భావిస్తున్నారట.

అంతేకాదు కన్నా లక్ష్మీ నారాయణతో ఆయన టచ్ లో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.. గుంటూరు జిల్లా బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారు అని కూడా తెలుస్తోంది.. మరి మాజీ ఎమ్మెల్యే గురించి బాబు ఏమి ఆలోచనచేస్తారో చూడాలి , అయితే కన్నా ఫోకస్ మాత్రం ఇటు వైసీపీ టీడీపీ నేతలపై ఉంది అంటున్నారు అందరూ.