తెలుగుదేశం పార్టికీ కంచుకోట జిల్లా అంటే వెంటనే గుంటూరు అని చెప్పాలి.. కమ్మసామాజిక వర్గం కూడా మెజార్టీ ఉండటంతో ఇక్కడ పార్టీ బలంగా మారింది అంటారు.. అయితే ఇప్పుడు వైసీపీ మెజార్టీ స్ధానాలు గెలుచుకుంది. కాని పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్లు ఓటమి పాలయ్యారు. అయితే గుంటూరు జిల్లాలో వైసీపీ మరింత బలంగా మారడానికి అనేక రాజకీయాలు చేస్తోందట.
తాజాగా గుంటూరులో వైసీపీ గంపగుత్తగా ఆరుగురు కీలక నేతలను ఒకేసారి వైసీపీలో చేర్చుకోవాలి అని ప్లాన్ వేస్తోందట.. పైగా వారిలో ఓ మాజీ మంత్రి కూడా ఉన్నారు అని తెలుస్తోంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట .వారు అంతా కేడర్ వల్ల చాలా సమస్య ఎదుర్కొంటున్నారు అని , అందుకే తాము పార్టీ మారాలి అని భావిస్తున్నారట.
అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు పట్టు ఉన్న జిల్లాలో నేతలని కోల్పోకూడదు అని వారితో ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి