టీడీపీకి ఆప్తమిత్రులు గుడ్ బై

టీడీపీకి ఆప్తమిత్రులు గుడ్ బై

0
89

తెలుగుదేశం పార్టికి ఇక గుంటూరు జిల్లా నుంచి షాక్ ల మీద షాక్ లు రానున్నాయి అని తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ క్రష్ణా జిల్లా, ప్రకాశం పై ఫోకస్ చేసిన వైసీపీ , ఇక అమరావతి ప్రాంతంలో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ పార్టీలో సీనియర్లు అలాగే మాజీ మంత్రులకు గాలం వేస్తోందట. వెంటనే చిక్కే నేతలను ముందు తీసుకోవాలి అని చూస్తున్నారు.

అంతేకాదు తెలుగుదేశం పై విసుగు చెందిన నేతలు కూడా గుంటూరులో చాలా మంది ఉన్నారు.. ముఖ్యంగా బాబు రెడ్ కార్పెట్ పరిచిన ఇద్దరు నేతలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారట. ఇటీవల ఓ నాయకుడు తన కేడర్ చెదిరిపోతోంది అని, అందుకే పార్టీకి దూరం అవ్వాలని భావిస్తున్నా అని చెప్పారట… అయితే అతను మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆ నాయకుడి గురించి బాబు కూడా పట్టించుకోలేదు అని తెలుస్తోంది, అయితే ఆయన ఆప్తమిత్రుడు కూడా పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకున్నారట, మరి బాబు వారిని వదులుకుంటారా అనేది చూడాలి.