తాజా ఏపీ పాలిటిక్స్ పై తారక్ ఏమన్నారంటే

తాజా ఏపీ పాలిటిక్స్ పై తారక్ ఏమన్నారంటే

0
102

తెలుగుదేశం పార్టీ బాగాలేదు పార్టీని చంద్రబాబు- లోకేష్ నడిపించలేకపోతున్నారు, 250 మంది ఉండే పార్టీ కేవలం 23కి పడిపోయింది, తెలంగాణలో పార్టీకి తాళం వేశారు, అందుకే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సైకిల్ ఎక్కాలి అని అంటున్నారు ఆయన అభిమానులు.. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇదే కోరుకుంటున్నారు.. చంద్రబాబు వెనుక ఉన్న నేతల కోరిక కూడా ఇదే , కాని వారు మాత్రం పైకి ఇది చెప్పడం లేదు.

అయితే తాజాగా సినిమాల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ 2009 లో వేశారు అని సన్నిహితులు అంటారు.. నిజంగా ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే, ఎన్టీఆర్ కు మైలేజ్ వచ్చేది, అయితే అప్పుడు అనేక పేపర్లలో పలు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ సాధించలేకపోయారు అని. మళ్లీ చంద్రబాబు లోకేష్ ఉండగా పార్టీలో తాను ఎందుకు అని అనుకుంటున్నారట జూనియర్ ఎన్టీఆర్ సీనియర్లు వారు చాలు అని భావిస్తున్నారట.

ఎన్టీఆర్ తాను ఇప్పుడు రాజకీయాల్లోకి రాను అని చెప్పారట.. తన సన్నిహితులతో ఈ మాటచెప్పారు అని తెలుస్తోంది. ఇంకా రాజకీయాలకు చాలా సమయం ఉంది అని అన్నారట.