మంచు వారసుల కొత్త సినిమాలు స్టార్ట్

మంచు వారసుల కొత్త సినిమాలు స్టార్ట్

0
138

మంచు వారసుల సినిమాలు ఇటీవల కాలంలో వెండి తెరపై కాస్త కనిపించడం లేదు.. అయితే కెరీర్ పరంగా విష్ణు మంచు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి.. అయితే విజయాల కోసం అన్నదమ్ములు ఇద్దరూ మంచి కథలు కూడా వింటున్నారు.. ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ ఈ రెండు సినిమాలు విష్ణుకి అంతగా పేరు తీసుకురాలేదు.

అలాగే మంచు మనోజ్ అయితే 2017లో ఒక్కడు మిగిలాడు సినిమా చేశాడు, తర్వాత మరే సినిమా కూడా ఆయన చేయలేదు.. తాజాగా కొత్త చిత్రాలు పట్టాలెక్కిస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరూ..

మూడు రోజుల క్రితం విష్ణు తన కొత్త ద్విభాషా చిత్రం మోసగాళ్ళును అనౌన్స్ చేశారు. 2020 వేసవికి ఈ చిత్రం విడుదలకానుంది. ఇక వ్యక్తిగత సమస్యల నుండి రిలీఫ్ పొందిన మనోజ్ కూడా కొత్త కథ చిత్రీకరణకు రెడీగా ఉందని, త్వరలో కలుద్దాం..కుమ్మేద్దాం అంటూ సినిమాను ఖాయం చేశారు. సో వచ్చే ఏడాది మంచు వారి ఇద్దరు వారసులు కొత్త సినిమాలతో రానున్నారు ప్రేక్షకుల ముందుకు.