సీమ భగ్గుమన్న విభేదాలు…

సీమ భగ్గుమన్న విభేదాలు...

0
39

రాయలసీమ యూనివర్శిటీలో విద్యార్ధి, ఉద్యమ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గత కొన్నేళ్లుగా రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్న సీమక్రిష్ణ పై మరో విద్యార్ధి సంఘం నాయకులు శ్రీరాములు, నాగరాజుతో పాటు మరికొందరు కలసి తీవ్రంగా దాడి చేశారు.

రాయలసీమ యూనివర్శిటీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై పై సీమకృష్ణ క్యాంపస్ లో బుధవారం విద్యార్థులతో కలిసి అవగాహనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వందల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. సజావుగా జరుగుతున్న కార్యక్రమంలోకి శ్రీరాములు అనే యూనివర్శిటీ విద్యార్ధి నాయకుడితో మరికొందరు కలిసి వచ్చి వందలమంది విద్యార్ధుల సాక్షిగా సీమ క్రిష్ణపై అమానుషంగా దాడి చేశారు.

యూనివర్శిటీలో తమ అనుమతి లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ బెదింపులకు పాల్పడ్డారు. దాడిలో గాయపడిన సీమక్రిష్ణను తోటి విద్యార్ధి నాయకులు, వర్శిటీ విద్యార్ధులు కలిసి ఆసుపత్రికి తరలించారు. క్రిష్ణకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

ప్రశాంతంగా ఉన్న యూనివర్శిటీలో ఇలా గొడవలకు పాల్పడిన విద్యార్ధి నాయకులు శ్రీరాములు, నాగరాజు తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ విద్యార్ధి, ఉద్యమ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.