ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు… పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు… అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు మూడు రోజులు పర్యటించారు…
కార్యకర్తలతో పార్టీనేతలతో సమావేశం అయ్యారు… ఈ పర్యటన నిన్నటితో ముగిసింది… ఈరోజు ఆయన అమరావతిలో పర్యటించనున్నారు… అయితే చంద్రబాబు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు రైతు కూలీల పేరుతో నిరసణ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి…
కృష్ణానది కరకట్ట నుంచి రాయపూడి వరకూ వెలిసిన ఈ ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతులు ప్రశ్నల వర్షం కురింపిచారు… రాజధాని పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్ చూపించి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు… రాజధాని పేరుతో మీరు చేసిన మోసానికి వెంటనే క్షమాపణ చెప్పాలి చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగు పెట్టాలని వారు ప్రశ్నించారు…