ప్రియాంక రెడ్డి హత్యా నింధితులు దొరికేశారా

ప్రియాంక రెడ్డి హత్యా నింధితులు దొరికేశారా)

0
107

అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను పసిమెగ్గలుగానే చిదిమేస్తున్నారు, వయసులో ఉన్న అమ్మాయిలని నిర్దాక్ష్యణ్యంగా కడతేరుస్తున్నారు కొందరు మానవమృగాలు… హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే ఓ మహిళా వెటర్నరీ డాక్టర్ దారుణమైన రీతిలో హత్యకు గురైందన్న విషయం సెన్సేషన్ సృష్టించింది.

తాజాగాఆమెని హత్య చేసింది లారీ డ్రవర్లు అని పోలీసులు నిర్దారణకు వచ్చారు, ఆమెని సుమారు తెల్లవారు జామున 3 గంటలకు హత్య చేశారు అనేది తెలుసుకున్నారు ఐదు గంటల సమయంలో ఆమెపై పెట్రోల్ పోశారని తెలుసుకున్నారు పోలీసులు. హంతకులు లారీలను అడ్డుగా పెట్టి ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

స్కూటీ కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతపురానికి చెందిన ఈ లారీ డ్రైవర్, క్లీనర్లు ఇక్కడ ఆగారా, వారు టోల్ కట్టిన సమయం లారీ ఎప్పుడు వెళ్లింది ఇలా అన్ని విషయాలు పరిశీలన చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు..ముఖ్యంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు, వారే ఈ దారుణానికి పాల్పడ్డారా అని పోలీసులు విచారణ చేస్తున్నారు.