సంచలనం వైసీపీకి మరో కొత్త పేరు పెట్టిన టీడీపీ

సంచలనం వైసీపీకి మరో కొత్త పేరు పెట్టిన టీడీపీ

0
89

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాజాగా కొత్త పేరు పెట్టింది…. ఇటీవలే కాలంలో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం కొనసాగుతోంది… తాజాగా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేశారు…

ఈ పర్యటనలో ఆయనపై రాళ్ళతో చెప్పులతో దాడి చేశారు… దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు… వైసీపీ నాయకులు వారి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడుపై దాడి చేయించారని ఆరోపిస్తోంది… ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి యనమల స్పందించారు…

వైసీపీ, పోలీసులు కుమ్మక్కై తమ నేతపై దాడి జరిపించారని ఆయన ఆరోపంచారు… ప్రస్తుతం వైసీపీ వీధి నాటకాల కంపెనీగా తయారు అయిందని యనమల అన్నారు… రాజధాని మారుస్తే ప్రజాగ్రహానికి గురవుతామని భయపడుతున్నారని అందుకే కమిటీలతో కాలయాపన చేస్తున్నారని యనమల అన్నారు…