తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు.. ఆయన పార్టీ మారరు అని అందరూ అనుకుంటారు.. అయితే ఇటీవల ఆయన మౌనంగా ఉండేసరికి ఆయన పార్టీ మారుతున్నారు అని కొన్ని వార్తలు వచ్చాయి.. అయితే ఇటీవల ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తారు అనే అనుమానం జిల్లా నాయకులు చేశారు కాని పార్టీ మారలేదు.
తాజాగా ఆయన కొద్ది రోజులు పనులతో బిజీగా ఉండి టీడీపీలో కార్యక్రమాలకు హజరుకాలేదట.. తాను పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాను, అధికారం ముఖ్యం కాదు, అలాగే పార్టీలో ఉంటాను అని తెలియచేశారు.. తాను ఏ పార్టీకి వెళ్లను అని తెలుగుదేశంలోనే ఉంటాను అని తన సన్నిహితులకు తెలియచేశారట.
తనపై ఎన్ని కుట్రలు విమర్శలు చేసినా తిప్పికొడతాను కాని వారికి లొంగను అని సోమిరెడ్డి తెలియచేశారట. అయితే నెల్లూరు జిల్లాలో నయారాజకీయాల కోసం పార్టీలు చాలా ఆలోచనలు చేస్తున్న విషయం, జిల్లా తెలుగుదేశంలో కొత్త భయాలకు కారణం అయింది.