2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చంద్రబాబు నాయుడు గాడి తప్పిన పార్టీని ట్రాక్ లో తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు…. పార్టీ కోసం తన వయస్సుకు మించి జెర్నీలు చేస్తున్నారు… పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశాగా అడుగులు వేస్తుంటే తమ్ముళ్లు మాత్రం తలోదారి చూసుకుంటున్నారు…
ఇప్పటికే కృష్ణా జిల్లాలో దేవినేని అవినాష్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… ఇక ఇదే క్రమంలో ప్రొద్దుటూరు టీడీపీ నేత వరదరాజులు రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి….
ఎన్నికల ఫలితాలు వెలుబడిన నాటి నుంచి ఆయన టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు… ఇక తన రాజకీయ దృష్ట్య ఇతర పార్టీల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు… కాగా వరదరాజులు రెడ్డి టీడీపీ సీనియర్ నేత పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్నారు…