2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు… కొందురు వైసీపీలో జంప్ చేస్తుంటే మరికొందరు బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారు… దీంతో టీడీపీలో ఉండేదేవరో ఉడేదేవరో అర్థంకాని అయేమయ పరిస్థితిలో ఉంది…
తాజాగా మరో కీలక నేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించి ఫిరాయింపు ఎమ్మెల్యేగా బీకాంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందని చెప్పి ఫేమస్ అయిన జలీల్ ఖాన్ తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట…
అయితే జగన్ మాత్రం ఆయన ఎంట్రీకి నో చెబుతున్నారట…. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించిన జలీల్ ఈ ఎన్నికల్లో తన కూతురుని పోటీ చేయించారు కానీ ఆమె ఓటమి చెందారు.. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవిని ఇచ్చారు జగన్… అందుకే జలీల్ ఖాన్ ను జగన్ పట్టించుకోరని వార్తలు వస్తున్నాయి..