దిష హత్య కేసులో వెలుగులోకి మరో నిజం నోరువిప్పిన ఆరీఫ్

దిష హత్య కేసులో వెలుగులోకి మరో నిజం నోరువిప్పిన ఆరీఫ్

0
114

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిష ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు అని అందరూ కోరుతున్నారు. తాజాగా ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో ఉన్న కీలక నిందితుడు ఆరిఫ్‌ పోలీసులకు తెలియచేశాడు అని వార్తలు వస్తున్నాయి.

ఆమెని అక్కడ నుంచి ముక్కు నోరు మూసి తీసుకువెళ్లామని ఆమె రక్షించడంటూ పెద్దగా కేకలు వేసిందని చెప్పాడు. ఆమె అరుపులు ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో చెన్నకేశవులు వెంటనే తన జేబులోని మద్యం సీసా తీసి బలవంతంగా ఆమె నోట్లో పోశాడు అని చెప్పారు. ఇలా చేసిన తర్వాత ఆమె స్రహ కోల్పోయింది అని చెప్పాడు.

ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి బతికి ఉండగానే పెట్రోల్‌ పోసి నిప్పటించారు ఈ దుర్మార్గులు.
అయితే బతికి ఉండగానే ఇలా దారుణానికి పాల్పడి చంపడం అంటే వారి క్రూరత్వం ఎలాంటిదో తెలుస్తోంది, ఆమె బ్రతికితే తమ ప్రాణాలకు ముప్పు అని భావించారు.

చివరకు పెట్రోల్ పోసి అంటించారని పోలీసులు తెలుసుకున్నారు. వీరిలో ఆరీఫ్ కు జర్వం అని అలాగే చెన్నకేశవులకి కిడ్నీ వ్యాధి అని చెబుతున్నారట, ముఖ్యంగా జైలులో దోమలు కుడుతున్నాయని చెబుతున్నారట పోలీసులకు…వీరి కేసు మరో 10 రోజుల్లో పూర్తి అవుతుంది అని వీరికి ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది అంటున్నారు పోలీసులు.