న్యాయవాదులకు స్వీట్ న్యూస్ చెప్పిన జగన్

న్యాయవాదులకు స్వీట్ న్యూస్ చెప్పిన జగన్

0
101

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా తన ఆరునెలల పాలనలో అన్నీ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ షాక్ అవుతోంది.. ఆరునెలల్లో జగన్ తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నారు, అలాగే అన్ని పనులు పేదలకు చేస్తున్నారు.

అయితే తాజాగా సీఎం జగన్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. జూనియర్ న్యాయవాదుల కోసం వైఎస్సార్ లా నేస్తం పథకం ను ప్రారంభించారు.దీంతో ఇది లాయర్లకు చాలా మంచి పథకం అని అందరూ అంటున్నారు. మరి ఈ పథకం ద్వారా ఏం జరుగుతుంది ?వారికి లాభం ఏమిటి? ప్రభుత్వం ఎందుకు దీనిని తీసుకువచ్చింది అంటే.

ఈ పథకం ద్వారా జూనియర్‌ న్యాయవాదులకు ప్రతి నెలా రూ.5వేల రూపాయలు ప్రభుత్వం తరుపున అందచేయనున్నారు. అంతేకాదు న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. అయితే న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల చట్టంలో సవరణలపై మార్పులు తీసుకువస్తున్నందుకు సీఎం జగన్‌కు అందరూ ధన్యవాదాలు తెలిపారు, ముఖ్యంగా చట్టం ప్రకారం నడుచుకోవాలి పేదలకు న్యాయం వైపు పోరాడి న్యాయం చేయాలి అని జగన్ కూడా తెలియచేశారు, ఎలాంటి సమస్యలు ఉన్నా తన ద్రుష్టికి తీసుకురావాలి అని న్యాయవాదులకు తెలియచేశారు.