ఆనంతో జగన్ భేటీ ? క్లారిటీ రానుందా

ఆనంతో జగన్ భేటీ ? క్లారిటీ రానుందా

0
88

నెల్లూరులో రాజకీయంగా వైసీపీకి చిక్కులు ఎదురయ్యే పరిస్దితి ఉంది అంటున్నారు రాజకీయ మేధావులు.. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేసి అన్నారు అనేలా చర్చ జరుగుతోంది. వైసీపీకి ఇప్పుడు జిల్లాలో మంచి పట్టున్న ప్రాంతం నెల్లూరు ..పెద్ద సిటీ .అక్కడ రాజకీయాలు నెల్లూరు నగరం చుట్టు తిరుగుతున్నాయి అంటున్నారు మేధావి వర్గం.

మాఫియా ముఠాలకు అడ్డాగా మారింది అని వెంకటగిరి ఎమ్మెల్యే కామెంట్ చేయడంతో వైసీపీ నేతలు జగన్ దగ్గరకు ఈ విషయం తెలియచేశారు అని తెలుస్తోంది. ఆనంతో ఎవరికి పొసగడం లేదు ? ఏ నేతలకు ఆనంతో విభేదాలు వచ్చాయి ఇలా ప్రతీ అంశం చర్చకు వస్తోందట.

ఆనం ఇలా విభేదించడానికి కారణం కూడా తెలుసుకుంటున్నారు సీఎం వైయస్ జగన్ అని తెలుస్తోంది.
ఆనం కుటుంబం నెల్లూరు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తర్వాత ఆనం కుటుంబానిదే నెల్లూరులో పెద్దరికం. మరి ఆయన ఇలా కామెంట్లు చేయడంతో వైసీపీ కింద స్ధాయి కేడర్ ఏమని భావిస్తోరో అర్దం కాదు . అందుకే త్వరలో జగన్ ఆయనతో భేటీ అవుతారు అని, సమస్య ఏమిటో తెలుసుకుంటారు అని తెలుస్తోంది.. మరి చూడాలి దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.