మరోసారి నోటికి పదును పెట్టిన కొడాలి నాని

మరోసారి నోటికి పదును పెట్టిన కొడాలి నాని

0
101

ఏపీ పౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు… ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడ రైతు బజారులో సాంబిరెడ్డి కుటుంబాన్ని తాను కలిశానని అన్నారు…

సాంబిరెడ్డి ఆర్టీసీలో కండెక్టరుగా పని చేశారని 15 ఏళ్ళ గిందట గుండె సమస్యతో స్వచ్చందంగా ఉద్యోగానికి రాజీనామా చేశారని అన్నారు… అయితే చంద్రబాబు నాయుడు గుడివాడ రైతు బజారులో ఉల్లి కోసం జరిగిన తొక్కిసలాటలో
సాంబిరెడ్డి మృతి చెందారని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు…

కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి ఉల్లిపాలకోసం లైన్లో నిలబడి మృతి చెందారని చెబితే ప్రభుత్వం నుంచి 25 లక్షల ఎక్స్ గ్రేషియా వస్తుందని చెప్పారని అన్నారు.. ఆయితే ఈ విషయంపై తాను వెంటనే ఆరా తీశానని అన్నారు నాని… అలాంటి జరుగలుదని అన్నారు… ప్రస్తుతం చంద్రబాబు నాయుడు శవాలకోసం ఎదురు చూస్తున్నారని దీనికి పవన్ కూడా వత్తాసు పలుకుతున్నారని నాని ఆరోపించారు..