ఆ నాయకుడికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చిన జగన్

ఆ నాయకుడికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చిన జగన్

0
78

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.. అంతేకాదు వైసీపీలో తర్వాత రోజు చేరిపోయారు. వైసీపీ సిద్దాంతాలు ,పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరాను అని తెలిపారు.

ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి బీదమస్తాన్ రావు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద పోటీచేసి 1,48,571 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఆయన ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా వైసీపీలో చేరడం వెనుక కారణం ఏమిటి అనేది చూస్తే..

ఆయన వైసీపీలో చేరడానికి కారణం పార్టీ సిద్దాంతాలతో పాటు టీడపీలో ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు.. అంతేకాదు ఆయన కోరుకున్న సెగ్మెంట్ కూడా రాలేదు అనే బాధ ఆయనలో ఉంది.
ఏపీ, తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బీద మస్తాన్రావుకు వ్యాపారాలు ఉన్నాయి.

బీద మస్తాన్ రావు 2009 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మళ్లీ అక్కడే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు అయితే ఆయనకు జగన్ రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అందుకే ఆయన వైసీపీలో చేరారని టాక్ అయితే సింహపురిలో నడుస్తోంది.