దిశ ఘటన పై దేశంలో అందరూ ఆమెకు న్యాయం జరగాలి అని భావించారు.. కాని నిందితులు పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో వారిపై కాల్పులు జరిపారు పోలీసులు.. నలుగురు అక్కడికక్కడే మరణించారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోలీసులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.
అలాగే ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రిని పోలీసులని అసెంబ్లీలో శభాష్ అని తెలిపారు. వారు మంచి న్యాయం చేశారు అని అన్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ తొందరపాటు వ్యాఖ్యలతో ఆ కేసు సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు.
ఇప్పటికే నిందితుల్లో ఇద్దరు మైనర్లేనన్న ప్రచారం జరుగుతోంది వారి చదువుకు సంబంధించి సర్టిఫికెట్లు చూపిస్తున్నారు తల్లిదండ్రులు . . నిందితుల్లో ఇద్దరు మైనర్లే అని తేలితే మాత్రం పోలీసులకు చిక్కులు తప్పవన్నారు. ఎన్కౌంటర్పై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. ఇలా మైనర్లను చంపితే అది మరింత కేసు అవుతుంది అని అన్నారు ఆయన.