తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన దిశ ఘటనతో దేశంలో అందరూ అలర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఇలాంటి దారుణాలకు పాల్పడితే వారిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తో పోలీసులు కూడా ఇలాంటి కేసుల్లో చాలా కీలక డెసిషన్లు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఏపీలో సీఎం జగన్ కొత్త చట్టాన్నీ తీసుకువచ్చారు.
ఎవరైనా అత్యాచారానికి ఒడిగడితే వారికి ఖచ్చితంగా ఉరి శిక్ష విధిస్తామని శాసన సభలో బిలు ప్రవేశ పెట్టారు, ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ అందుకు ఆమోదం తెలిపింది. కేవలం 21 రోజుల్లోనే తీర్పు వెల్లడిస్తామని, అంతేకాకుండా మహిళలు, చిన్నారులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, మహిళలపై జరిగే అనేకమైన దాడులు, ఇతర లైంగిక వేధింపులు లాంటి నేరాలకు పాల్పడితే ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే జగన్ తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం అమలు అవుతుందా అనే మీమాంస స్టార్ట్ అయింది.
అసెంబ్లీలో అధికార పార్టీకి ఉన్న బలంతో ఆమోదం పొందటం సులువే. కానీ, విచారణ గడువును తగ్గించటంపైనే అటు గవర్నర్ తో పాటుగా కేంద్రం సైతం అభ్యంతరాలు చెబుతుంది అంటున్నారు న్యాయవాదులు, మరిదీనిపై జగన్ పునరాలోచిస్తారా లేదా గవర్నర్ కేంద్రంతో చర్చిస్తారా అనేది చూడాలి