జ‌గ‌న్ పై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న కామెంట్లు

జ‌గ‌న్ పై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న కామెంట్లు

0
90

వైసీపీ పాల‌న ఎలా ఉంది.. జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌జ‌ల‌ను మెప్పిస్తుందా ఆరునెల‌ల పాల‌న‌పై చాలా మంది ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అయితే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు కూడా జ‌గ‌న్ పాల‌న‌పై మాట్లాడుతున్నారు.వై ఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు అయిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పరిపాలనపై మరోసారి ఆసక్తి రేపే కామెంట్స్ చేసారు.

తెలుగుదేశం పార్టీ చురుకుగా ముందుకు వెళుతున్నా కేడ‌ర్ స‌మ‌స్య ఉంది అనేది తెలిసిందే, నేత‌లెవ‌రు ఉంటారో ఉండ‌రో తెలియ‌డం లేదు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకు అయితే రురల్ లో చాలా వీక్ గా ఉంది కానీ అర్బన్ లో స్ట్రాంగ్ గా ఉందని చెప్పారు ఆయ‌న‌.

అమ్మ ఒడి పథకాన్ని సక్రమంగా ఇచ్చినట్టయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రభావం చూపుతుంది అని అందువల్ల జగన్ కు ప్లస్ అవుతుందని ఉండ‌వ‌ల్లి కితాబిచ్చారు. ఇక వ‌చ్చే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌భావం ఎలా ఉంటుందో చూడాలి అన్నారు. జనం ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా అనేది ప్ర‌శ్నే.