ఏపీలో మరో ఎన్నికల జాతర

ఏపీలో మరో ఎన్నికల జాతర

0
98

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌రో ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతోంది ..అదే స్ధానిక సంస్ధ‌ల ఎన్నిక ఇది పూర్తి అయితే ఇందులో మెజార్టీ వైసీపీకి వ‌స్తే ఇక వచ్చే నాలుగున్నర సంవత్సరాలు వైసీపీకి అడ్డు ఉండదు. అలాగేప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు కూడా ఓ దిశ చూపిస్తాయి.

పార్టీ పరిస్దితి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఆరు నెలల జగన పాలనపై జనాలు ఏమనుకున్నారో తెలుస్తుంది.. దాని ప్రకారం ఓట్లు సీట్లు కూడా ఆ పార్టీకి వస్తాయి, అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం జనవరిలో ఎన్నికల పండుగ వాతావరణం కనిపించనుంది.

సంక్రాంతి తర్వాత ఏపీలో పంచాయతీ పోరు కనిపిస్తుంది అంటున్నారు ఆ తర్వాత మాత్రమేమున్సిపల్ పోరు ఉంటుంది అని తెలుస్తోంది.. మొత్తానికి ఫ్రిబ్రవరి చివరికల్లా అన్నీ రకాలుగా ఎన్నికలు పూర్తి అవ్వనున్నాయని తెలుస్తోంది.