అటువైపు అడుగులు వేస్తున్న కవిత

అటువైపు అడుగులు వేస్తున్న కవిత

0
81

వచ్చే ఏడాది రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి… ఈ రెండు సీట్లు టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది… అయితే ఈ రెండు పదవులు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మరుతోంది… అందులో ఒక సీటు కేసీఆర్ కేశవరావును రెన్యువల్ చేస్తారనే లేదా అనే చర్చ మొదలైంది….

ఈ సీటు పక్కన పెడితే మిగిలిన రెండో సీటు మాజీ ఎంపీ కవితకు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది… సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు కవిత… ఆ తర్వాత నుంచి ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉంటువచ్చారు…

ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు… అయితే ఆమెకు పోటీగా కేసీఆర్ అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ వినోద్ రాజ్యసభ సీటు రేసులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి… ఒకవేళ రాజ్య సభ సీటు వినోద్ కు ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కవితకు రాజ్యసభసీటు దక్కడం కష్టం… దీనికి తోడు కేసీఆర్ బందువు సంతోష్ రాజ్యసభ్యుడిగా ఉండటంతో కవితకు పెద్దలసభకు పంపడం వల్ల విమర్శలు రావచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి…