అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి… ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి వాలసలు ఎక్కువ అవుతున్నాయి… ఇప్పటికే చాలామంది తమ్ముళ్లు తమ రాజకీయ ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే…
ఇక ఇటీవలే మాజీ ఎమ్మెల్యే బీదమస్తాన్ రావు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఇక ఆయన సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కూడా వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ వార్తలపై ఆయన తాజాగా స్పందించారు…
కావలిలో ఎవరు పార్టీ మారినా కూడా తాను మాత్రం టీడీపీలో ఉంటానని స్పష్టం చేశారు… తాను పార్టీ మారే ప్రస్తక్తేలేదని అన్నారు రవిచంద్ర… కావలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు తమ పార్టీలోనే ఉన్నారని ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు మాత్రమే పార్టీ మారుతున్నారని అన్నారు…