అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలు రాజకీయ రంగాల్లో కూడా రాణించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు… అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కువ పదవులను మహిళలకు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు..
వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి… గవర్నర్ కోటాలో ఈరెండు స్థానాలకు మహిళలనే నియమించాలని చూస్తున్నారట జగన్… వైసీపీకి చెందిన ఒక ఎస్సీ ఒక బీసీ మహిళకు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యారని వార్తు వస్తున్నారు…
దీంతో పదవులు ఆశించే మహిళలకు కొత్త ఆశలు వస్తున్నాయి… బీసీ కోటాకు చెందిన కర్నూల్ మాజీ ఎంపీ బుట్టారేణుక పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. బీసీకోటాలో బుట్టాకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు…
కాగా 2014 ఎన్నికల్లో కర్నూల్ వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన బుట్టా ఆ తర్వాత టీడీపీలో చేరారు… 2019 ఎన్నికల సమయంలో తిరిగి ఆమె జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…