టీడీపీ నేతను వేటకొడవల్లతో నరికిచంపారు

టీడీపీ నేతను వేటకొడవల్లతో నరికిచంపారు

0
77

కర్నూల్ జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి… ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా వేట కొడవల్లతో దాడి చేసి ఆ తర్వాత ఆయన తలపై బండాయి మోది చంపారు గుర్తు తెలియని వ్యక్తులు…

ఈ ఘన బెలుంగుహల మధ్య చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది… హోటల్లో టీ తాగుతుండగా సుబ్బారావును కత్తితో నరికి చంపినట్లు తెలుస్తోంది… గ్రామాల్లో ఆదిపత్య పోరు వల్లే సుబ్బారావును హత్య చేసి ఉంటారని స్థానికంగా అనుమానిస్తున్నారు…

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు… సుబ్బారావు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా గుర్తించారు…

కాగా మరికొన్నిరోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్నాయి… ఇలాంటి సమయంలో ఈ హత్య చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు…