టీడీపీలో 35 సెగ్మెంట్లలో సరికొత్త నిర్ణయం

టీడీపీలో 35 సెగ్మెంట్లలో సరికొత్త నిర్ణయం

0
71

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సెగ్మెంట్ల వారీగా చూసుకుంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. మిగిలిన 152 సెగ్మెంట్లలో తెలుగుదేశం ఇంచార్జీలే పార్టీ తరపున ముందుకు వెళుతున్నారు.. వైసీపీ నేతలు తెలుగుదేవం నేతలని కొందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని చంద్రబాబే నేరుగా విమర్శలు ఆరోపణలలు చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో చాలా మంది ఓటమి పాలవుతారు అని కొన్ని సర్వే రిపోర్టులు వచ్చినా, చాలా వరకూ చంద్రబాబు అభ్యర్దులని మార్చలేదు అదే టీడీపీ కొంప ముంచింది.

తాజాగా 35 సెగ్మెంట్లలో కొందరు పార్టీ ఇంచార్జులని మారుస్తారు అని తెలుస్తోంది.. కొందరు యువనేతలకు అక్కడ పార్టీ పగ్గాలు ఇవ్వాలి అని బాబు ఆలోచిస్తున్నారట.. అయితే ఇది స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటారా లేదా తర్వాత తీసుకుంటారా అనేది చూడాలి.. ముఖ్యంగా సీమలో అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా వరకు అభ్యర్దుల మార్పు ఉంటుంది అంటున్నారు.

అయితే ఇలా మార్పు చేస్తే కొందరు పార్టీ తరపున తమ వాయిస్ వినిపించే వారికి అవకాశం ఉంటుంది. కొత్తవారికి పార్టీలో పెద్ద పీట వేసినట్లు ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నుంచి ఆ లిస్ట్ అయితే బాబు టేబుల్ మీదకు వచ్చింది అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి