జగన్ పై స్పీడు పెంచిన జేసీ…

జగన్ పై స్పీడు పెంచిన జేసీ...

0
87

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పీడ్ పెంచారు… ఇన్నాళ్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై వందకుపైగా మార్కులు వేసిన దివాకర్ రెడ్డి ఇప్పుడు రివర్స్ అయ్యారు… తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు…

ఈ పర్యటనలో జేసీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు… వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న మంచి లక్షణాలు జగన్ మోహన్ రెడ్డి లో10 శాతం కూడా లేదని అన్నారు… జగన్ మరో రాజరెడ్డి అని అన్నారు… అచ్చం రాజారెడ్డి లక్షణాలతో జగన్ ఉన్నారని జేసీ వ్యాఖ్యానించారు…

ఎలాగైనా చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టాలని డీజీపీని ఒత్తిడి తెస్తున్నారని జేసీ ఆరోపించారు.. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయని అప్పుడు తాము అధికారంలోకి వస్తామని అన్నారు… అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి అంతు చూస్తామని అన్నారు… టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారందరిని గుర్తు పెంటుకుంటామని అన్నారు…