హైదరాబాద్ లో దారుణం జరిగింది… వివాహేతర సంబంధానికి ఓ యువతి నిరాకరించిందనే ఉద్దేశంతో ఓ వ్యక్తి కత్తి దాడి చేశారు… హైదరాబాద్ హయత్ నగర్ లో జరిగింది ఈ ఘటన… అబ్దుల్లాపూర్ మెంట్ మండలానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో మన్సూరాబాద్ డివిజన్ లో ఒంటరిగా నివసిస్తోంది…
అదే మండలానికి చెందిన నారంబాబు గౌడ్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఈ పరిచయాన్ని అడ్డు పెట్టుకుని వివాహేతర సంబంధంకొనసాగించాలని ఒత్తిడి తెచ్చాడు… అయితే ఆమె నిరాకరించింది… అతని వేధింపులు రోజు రోజు ఎక్కువ కావడంతో ఇటీవలే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది…
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.. ఇటీవలే జైలు నుంచి విడుదల అయిన ఆయన మరోసారి బాధితులరాలు ఇంటికి వెళ్లి వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చారు… అందుకు ఆమె నిరాకరించడంతో వెంటతెచ్చుకున్నకత్తితో ఆమెపై దాడి చేశారు.. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు