బాబుకు బిగ్ షాక్ గుంటూరు జిల్లా టీడీపీ నేత పార్టీ మారే ఛాన్స్

బాబుకు బిగ్ షాక్ గుంటూరు జిల్లా టీడీపీ నేత పార్టీ మారే ఛాన్స్

0
62

ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి… ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయంలో అంత ఈజీగా పార్టీ గురించి అంచనా వేయలేక పోతున్నారు ఆ పార్టీ నేతలు… ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఉదయం నుంచి మధ్యహ్నం వరకు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నేతలు సాయంత్రం అయ్యేలోపు వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

దీంతో పార్టీలో ఉండేది ఎవరో ఊడేది ఎవరో అర్థం కాని పరిస్థితని అంటున్నారు… ఇటీవలే గుడివాటి డీడీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అలాగే వంశీ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే ఇక ఇదే క్రమంలో గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా టీడీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట…

వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ధుళిపాళ్లకు ఈ సారి బ్రేకులు పడ్డాయి… దీంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు… తాజా సమాచారం ప్రకారం అనుచరుల కోరిక మేరకు వైసీపీలో చేరాలని చూస్తున్నారట…