చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే, రాజధాని కొందరికి అనుకూలంగా మార్చారు అని విమర్శలు చేస్తున్నారు, తాజాగా బీజేపీ నేతలు కూడా టార్గెట్ చేశారు బాబుని. ఏపీకి 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే, చంద్రబాబు ఒక్క పోర్టుకట్టాడా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టాడు.. నేను వైఎస్ ను పొగడడం లేదు..కానీ చంద్రబాబును మాత్రం వదలను అంటూ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
చంద్రబాబు మేధావి మైధాలజీ ఉందని తిమ్మిని బమ్మిని చేస్తాడు, ఆయన ఇలాంటి విషయంలో పెద్ద సిద్దహస్తుడు అని విమర్శించారు, చంద్రబాబు మాట్లాడితే హైదరాబాద్ డవలప్ చేశాడు అంటాడు.. మరి ఏపీలో మరి వేరే ప్రాంతం ఎందుకు డవలప్ చేయలేదు.. ఇప్పుడు అమరావతి కూడా అలాగే చేద్దాం అని అనుకున్నారు, చివరకు హైదరాబాద్ మన నుంచి ఎలా దూరం అయిందో తెలిసిందే అని విమర్శించారు.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీని 25 జిల్లాలుగా విభజిస్తున్నారని.. రాజధానిని వదిలేసి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. డవలప్ మెంట్ విషయంలో వైసీపీ సర్కారు బ్లూ ప్రింట్ వదిలితే అందరికి అర్దం అవుతుంది అని అన్నారు, వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చారు, 151 మంది గెలిచారు. మరి ప్రజలకు కచ్చితంగా న్యాయం చేయాలి అని ఆయన తెలియచేశారు